TELANGANA HISTORY AND CULTURE
Saturday, 30 August 2014
Wednesday, 27 August 2014
RECHARLA REDLA CHARITHRALO MERUPULU
RECHARLA REDLA CHARITHRALO MERUPULU is a well researched book which gives new insights into the roots of the rule and rulers of REDDI community. It is written by Sri Avala Buchi Reddy. The book also contains valuable articles contributed by Dr. Eemani Shivanagi Reddy, Dr. Dyavanapalli Satyanaryana and Dr. Sanganabhatla Narsaiah.
Monday, 17 December 2012
Kakatiyulanati telangana arthika jivanam - డా॥ ద్యావనపల్లి సత్యనారాయణ, 94909 57078
కాకతీయుల నాటి తెలంగాణ ఆర్థిక జీవనం
డా॥ ద్యావనవల్లి సత్యనారాయణ, 94909 57078
తెలుగునేల, ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతం స్వర్ణయుగాన్ని అనుభవించింది కాకతీయుల కాలంలోనే.
- కాకతీయ రాజలు తెలంగాణ గడ్డమీదనే పుట్టి, పెరిగి ప్రజల కష్టసుఖాలను ఎరిగినవారు. కాబట్టి, ప్రజల కష్టాలను తీర్చి సుఖాలను పెంచే మార్గాలను ఆలోచించి, ఆచరణలో పెట్టారు. అలా ప్రజలు ఆశించిన ఫలితాలను అందుబాటులోకి తెచ్చారు.
- తొలి కాకతీయ రాజులు రాష్ట్రకూట రాజులకు సామంతులుగా సుమారుగా రెండు వందల సంవత్సరాల పాటు నకీ.శ. 973 వరకు) హనుమకొండ-వరంగల్ జిల్లా ప్రాంతాన్ని పాలించారు. మరో రెండు వందల సంవత్సరాల కాలం నకీ.శ. 1162 వరకు) పశ్చిమ చాళుక్య రాజులకు సామంతులుగా మధ్య తెలంగాణను పరిపాలించారు. ఆ తరువాత స్వతంత్ర రాజులుగా యావత్ తెలుగుదేశాన్ని సుమారు 160 సంవత్సరాలు నకీ.శ. 1323 వరకు) ఏలారు.
- కాకతీయులు వ్యవసాయం, వ్యాపారం, ద్రవ్య విధానం తదితర ఆర్థిక రంగాల్లో తెలుగునేలపై ఉన్న వనరులను ప్రజల సంక్షేమానికి వినియోగపడేటట్లు అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచారు. ఆనాటి రాతి శాసనాలు, రాగి శాసనాలు, నాణాలు, గ్రంథాలు ఈ విషయాలను స్పష్టపరుస్తున్నాయి.
నాటికీ, నేటికీ వ్యవసాయం ప్రజల ప్రధాన జీవనాధారం. కాబట్టి, కాకతీయులు వ్యవసాయ భూమిని, పంటలను విస్తృతంగా అభివృద్ధి పరిచే చర్యలు తీసుకున్నారు. వ్యవసాయ భూమి పరిమాణాన్ని పెంచడానికి వారు ప్రధానంగా నాలుగు రకాల చర్యలు తీసుకున్నారు. ఒకటి: అడవులను నరికించి వ్యవసాయ యోగ్య భూములను అందుబాటులోకి తెచ్చారు. రెండు: నిరుపయోగంగా ఉన్న భూములను పోడు చేసేవారికి (వ్యవసాయం) పన్నుల రాయితీతో ఇచ్చారు. మూడు: గ్రామాలకు దూరంగా నిరుపయోగంగా ఉన్న భూములను బ్రాహ్మణులకు, పండితులకు, మంచి అధికారులకు, దేవాలయాలకు, అగ్రహారాలుగా నగామాలు), కానుకలుగా, వృత్తులను నిర్వహించుకోవడానికి ఇచ్చి ఆయా భూములను వ్యవసాయం యోగ్యంగా మార్చేలా చేశారు. నాలుగు: రాజ్యంలోని భూమి అంతటికీ రాజే యజమాని కాబట్టి, రాచపొలాలను సగం ఆదాయాన్ని చెల్లించే రైతులకు (అర్థసీరులు) కౌలుకు ఇచ్చారు. చివరి పద్ధతిని ‘అడపగట్టు’ అనేవారు.
కాకతీయులు చేపట్టిన పై సంస్కరణల వల్ల చెన్నూరు, మంథని, ఏటూరు నాగారం, పాలంపేట, పాకాల, కొత్తగూడ, ఎల్లందు, బయ్యారం, అమ్రాబాద్, శ్రీశైలం ప్రాంతాల్లో కొన్ని లక్షల ఎకరాలు భూమి కొత్తగా సాగులోకి వచ్చినట్లు, ఆయా ప్రాంతాల్లోనే కొన్ని వేల గ్రామాలు ఏర్పడినట్లు, ఆయా ప్రాంతాల్లో దొరికిన శాసనాలు విశదం చేస్తున్నాయి.
కొత్తగా సాగులోకి వచ్చిన భూములకు, రావలసిన భూములకు సాగునీరు అందించడానికి కాకతీయులు కొన్ని వేల చెరువులు తవ్వించారు. ప్రత్యేకించి తెలంగాణలో కాకతీయుల కాలంలో తవ్వించిన చెరువు లేని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదు.
మొదటి ప్రోలరాజు నకీ.శ. 1052 - 1076) తన బిరుదు ‘అరిగజ కేసరి’ పేరుతో వరంగల్ జిల్లా మహబూబ్‌బాద్ దగ్గర కేసరి సమువూదాన్ని తవ్వించాడు. అతని వారసుడు రెండవ బేతయ (1076 - 1108) మరో కేసరి సముద్రం, సెట్టి కేరెయ అనే చెరువులను నిర్మించాడు. రుద్రదేవుని మంత్రి గంగాధరుడు ఈనాటి హన్మకొండ బస్టాండ్ దగ్గరి చెరువుని కట్టించాడు.
గణపతిదేవుని కాలంలోనైతే (1199 - 1262) ఆయన బంధువులు, మంత్రులు, అధికారులు ఎందరో ఎన్నో చెరువులను తవ్వించారు. ఉదాహరణకు, ఆయన మంత్రి బయ్యన కొడుకు జగదాలు ముమ్మడి పాకాల చెరువును తవ్వించాడు. అది ఇప్పటికీ ఏటా 9,037 ఎకరాల భూమికి సాగు నీటిని అందిస్తున్నది. గణపతిదేవుని కింద మాండలిక పరిపాలకుడైన రేచర్ల రుద్రుడు రామప్ప చెరువు నిర్మించాడు. ఆ చెరువు ఇప్పటికీ 4,350 ఎకరాల భూమికి నీరందిస్తున్నది. ఆ చెరువు గట్టు తూర్పు కొసనున్న దేవాలయ మంటప స్తంభానికి చెక్కిన మూడు స్త్రీ మూర్తుల శిల్పాలు ఆ చెరువు ద్వారా వృద్ధి చెందే పాడిపంటలను సూచిస్తున్నాయి.
గణపతిదేవుని సోదరి మైలాంబ ఖమ్మం జిల్లాలో బయ్యారం చెరువును తవ్విస్తే, అతని మరో సోదరి కుందవ్వ అదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో తన పేర రెండు కుంద సమువూదాలను తవ్వించింది. అతని భార్య మైలమ కూడా కరీంనగర్ జిల్లాలో కటుకూరు చెరువును నిర్మించింది. గణపతిదేవుని సేనాని మల్యాల చౌండ కొండపర్తిలో ‘సమువూదాల గర్వాన్ని అణిచివేసే’ చౌండ సమువూదాన్ని నిర్మించాడు. ఈ చౌండ సముద్ర ప్రస్తావనలో మనకు ఆనాటి చెరువులను ‘సమువూదాలని’ ఎందుకు పిలిచేవారో స్పష్టమవుతున్నది.
చెరువులను తవ్వించడం ఆనాడు సప్త సంతానాల్లో ఒకటైన పుణ్యకార్యంగా ప్రచారంలో ఉండేది. కాబట్టి, రాజులతో పాటు చేతనైన వారెవరైనా చెరువులను తవ్విస్తుండేవారు.
చెరువులతో పాటు ఇతర సాగునీటి ఆధారాలు కూడా కాకతీయుల కాలంలో మనుగడ సాగించినట్లు శాసనాధారాలున్నాయి. అలా మనకు కుంటలు, ఊటకాలువలు, ఏతం, మోట, రాటనాలు, మనుషులే లాగే కప్పీ రాట్నాల ప్రస్తావనలు కన్పిస్తాయి. ఇల్లంతకుంట (కరీంనగర్ జిల్లా) ఒక కుంటకు ఉదాహరణ. ఊట కాలువలకు ఉదాహరణలుగా గొనుగు కాలువ, బొమ్మకంటి కాలువ, ఉత్తమ గండ కాలువ, ఉటుం కాలువ, చింతల కాలువ తదితరాలను పేర్కొనవచ్చు.
కరీంనగర్ జిల్లా ధర్మవరం మండలంలో ఉండే గొనుగు కాలువమీద హక్కు విషయమై నేఢవూరు, చామనపల్లి, కటిక్యోలపల్లి గ్రామస్తుల మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి ఆనాటి రాజు గణపతిదేవుడు రెండుసార్లు వారి వద్దకు అధికారులను పంపి, అన్ని కుల సంఘాల అభివూపాయాలను (ండుసార్లు) తెలుసుకుని, ప్రాడ్వివాకుని (న్యాయమూర్తి) సమక్షంలో తన తుది తీర్పు ప్రకటించి, ఆ కాలువ మీద చామనపల్లి మహాజనులకు బాహ్మణులకు) హక్కును కల్పించి, ఆ విషయాన్ని రాగి శాసన రూపంలో భద్రపరచడం జరిగిందీ అంటే ఆనాటి రాజులు ప్రజల సంక్షేమం, అభివూపాయాల పట్ల ఎంత శ్రద్ధ తీసుకునేవారో అర్థమవుతుంది.
సాగునీటి కల్పన అనేది ఆనాడు దానంగా, వ్యాపారంగా కూడా చెలామణిలో ఉండేది. ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ దేవుడికి దానంగా చెరువులను, కుంటలను తవ్వించడం గురించి పైన తెలుసుకున్నాం. చెరువులు, కుంటలు, కాలువలు ప్రైవేటు వ్యక్తులు కూడా తవ్వించి లేదా మరమ్మత్తులు చేసి రైతులకు సాగునీటిని అందించే పద్ధతి కూడా కాకతీయుల కాలంలో అమలులో ఉండేది. లబ్ధి పొందిన రైతులు మరమ్మత్తుదారుకు తాము పండించిన ప్రతి ధాన్యానికి ఒక కుంచం చొప్పున చెల్లించేవారు. అలా చెల్లించడాన్ని ‘పుట్టికుంచం’ లేదా ‘చెరువు కుంచం’ అనేవారు. ఈ పద్ధతిని ‘దశవంధ’ అనేవారు. చెరువు కింది రైతులందరూ చెరువు కుంచం చెల్లించక అందుకు బదులుగా ఉమ్మడిగా మరమ్మత్తుదారుకు దశంవధ మాన్యం (కొంత భూమి) కూడా ఇవ్వడం అమలులో ఉండేది. పుట్టి ...అంటే 80 కుంచాలు... పండించుకునేందుకు సాగునీరును నిరంతరాయంగా కల్పించే ఏర్పాటు చేసి, కేవలం ఒకే కుంచం పన్ను వసూలు చేసుకునేట్లు చూడడం ఆనాటి ప్రభుత్వ సంక్షేమ యంత్రాంగానికి ఒక మచ్చు తునక.
ఆనాటి భూముల్లో అడవులు, పచ్చిక బయళ్ళు పశువుల మేతకు, వంట చెరుకు, వ్యవసాయ పనిముట్లు, వన మూలికలు తదితర అవసరాలకు ఉపయోగపడగా, అచ్చుకట్టు భూముల్లో వ్యవసాయం చేసేవారు. అచ్చుకట్టు భూముల్లో ఈనాటి లాగే మెట్ట భూముల్లో వర్షాధార పంటలు పండేవి. మాగాణి భూముల్లో నీటి నేలలు, తోంటలు అని రెండు రకాలుండేవి. నీటినేల అంటే వరి పండించే నేల. తోంట అంటే తోట. తోటలో ఈనాటి మాదిరిగానే కూరగాయలు, కొన్ని రకాల వాణిజ్య పంటలు, పండ్లను పండించేవారు.
రాజ్యంలోని భూములన్నిటికీ రాజు యజమాని కాబట్టి, రైతులు అన్ని రకాల భూములపై శిస్తుపన్ను చెల్లించేవారు. అడవులు, పచ్చిక బయళ్ళపై పుల్లరి, ఉప్పు మడులపైన అడ్డవట్టు సుంకం చెల్లించేవారు. మెట్ట, మాగాణి భూముల పైన చెల్లించే పన్నును ‘అరి’ అనేవారు. దీనిని ధనం, ధాన్యం, వస్తురూపాల్లో శిస్తు చెల్లించడం అమలులో ఉండేది. ఒక నిర్ణీత భూమిలో పండిన పంటను ‘సిద్ధాయం’ అనేవారు. ఈ సిద్ధాయంలో ఒక పుట్టి ధాన్యానికి ఒక బంగారు (పహిండి) నాణాన్ని చెల్లించేవారు. దాన్ని ‘పుట్టి పహండి’ లేదా ‘పుట్టిమాడ’ అనేవారు. ‘సిద్ధాయం’ పెరిగితే ప్రభుత్వానికి చెల్లించవలసిన పుట్టిమాడల సంఖ్య పెరుగుతుందన్న మాట. నీరు నేల సిద్ధాయం మీద చెలించే పన్నును ‘గడ్డుగమాడ’ అనేవారు.
శిస్తును ధాన్యరూపంలో వసూలు చేసే సందర్భంలో తూము న్యాయకాండ్రు పంటను కొలిచేవారు. తాసు న్యాయకాండ్రు తూచేవారు. ఒక పుట్టి పంట పండితే ఒక తూము వసూలు చేసేవారు. దీనిని ‘పుట్టితూము’ లేదా ‘రాసితూము’ అనేవారు. ‘పుటి’్ట అంటే 80 కుంచాలు, ‘తూము’ అంటే 4 కుంచాలు. కాబట్టి, భూమి శిస్తు పంటలో 5 శాతం ఉండేదని చెప్పవచ్చు. పండిన పంట ధాన్యం కాక మరోలాగా కొలిచే పంట అయితే, ఆ పంటలో కొంత భాగాన్ని అది పండిన రూపంలోనే శిస్తుగా చెల్లించేవారు. అలాంటి వస్తురూప శిస్తును ‘పంగ’ లేదా ‘పంగము’ అనేవారు. కొలుచు, కొలుగు, పఱ అనే పదాలు కూడా అదే అర్థంలో శాసనాల్లో కనిపిస్తున్నాయి.
పంగను సరైన సమయంలో, సరైన విధంగా చెల్లించకపోతే అందుకు శిక్షగా ‘పంగతప్పు’ అనే పన్నును చెల్లించవలసి ఉండేది. పంగము రూపంలో వసూలైన పంటను వసూలు చేసిన ‘ఆయకాండ్రు’ అనే అధికారులు అదే రోజు అంగట్లో అమ్మేందుకు కూడా రైతే అమ్మకపు పన్ను, కొనేవాడు ‘విల్చుపన్ను’ కట్టేవారు. ఈ రెండు పన్నులను ‘అమ్మడికాలు’ అనేవారు.
పై పన్నులతో పాటు కాంపులు (రైతులు) రాజుకు కానిక, దరిశనము అనే పన్నులను చెల్లించేవారు. రాచపొలాలను కౌలుకు తీసుకోవడం కోరు వ్యవస్థ. అలాంటి పొలాల్లో పండిన పంటలో ఆర్థాయం రాజుకు చెల్లించవలసి ఉండేది. పంట మంచిగా పండినప్పుడు చెల్లించే పన్నును ‘వెన్నుపన్ను’ అనేవారు. పొలానికి నీరు అందించినందుకు చెల్లించవలసిన పన్ను కాలాన్ని బట్టి పండిన పంటలో ఆరవ భాగాన్నుండి సగభాగం వరకు ఉండేది. ఒక్క రాజుపోలం పైనే సగభాగం పన్ను ఉండేది. మిగతా భూములపై సాధారణంగా ఐదవ భాగం పన్నుగా ఉండేది. ప్రభుత్వానికి అందిన పన్ను తిరిగి ప్రజల సంక్షేమం కోసం చెరువులు, కుంటలు, కాలువలు తవ్వించడం తదితర ప్రజోపయోగ పనుల నిర్మాణం కోసమే వినియోగించబడేది. పైగా ఆనాటి రాజులు అగ్రహారాలు, వృత్తులు, మాన్యాలు వరుసగా పండితులు, దేవాలయాలు, దేశ సేవకులకు ఉచితంగా ఇచ్చి, వాటిపై పన్ను రాయితీ కల్పించేవారు.
కొత్తగా సాగులోకి వచ్చిన భూములకు, రావలసిన భూములకు సాగునీరు అందించడానికి కాకతీయులు కొన్ని వేల చెరువులు తవ్వించారు. ప్రత్యేకించి తెలంగాణలో కాకతీయుల కాలంలో తవ్వించిన చెరువు లేని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదు.
అలనాటి వైభవం
ఆనాటి పంటలు ఎలా ఉండేవో అప్పటి కవి ఒకరు కింది శ్లోకంలో ఇలా వర్ణించారు.
ఆంధ్రాస్సంతి గరీయాంసః కాంచన ఛాయ శాలయః
యథాహాటక స్యూతస్య కోటరారత్న శాలిః
అంటే...ఆంధ్రదేశపు భూములు పండిన వరి చేలతో బంగారు మేరు పర్వతం లాగా మెరుస్తున్నాయని అర్థం. వరితోపాటు ఇతర పంటలు కూడా బాగా దిగుబడి నిచ్చేవని సాహిత్య ఆధారాలు తెలియజేస్తున్నాయి.
ఇవాళ తెలంగాణలో పండిస్తున్న అన్ని ఆహార పంటలు, పప్పు దినుసులు, వాణిజ్య పంటలన్నింటినీ కాకతీయుల కాలంలో పండించేవారు. ప్రభుత్వమే కాకుండా ప్రైవేటు వ్యక్తులు కూడా భూమిని కౌలుకిచ్చేవారు. దానిని ‘తాంబూల స్రవ’ అనేవారు. ఆ సమయంలో తాంబూలాలను రైతులు పరస్పరం మార్చుకునే వారేమో!
కాకతీయుల విధానాల వల్ల ప్రజల ఆదాయం మళ్ళీ ప్రజల సంక్షేమానికే వినియోగించబడి ప్రజలు శాంతి సౌభాగ్యాలతో విలసిల్లారు. కాని, ఆ రాజులు మరింత ధనవంతులు కాలేదు. విలాసాలకు మరుగలేదు. తద్వారా దేశ వినాశనానికి ఒడి కట్టలేదు.
కాకతీయుల కాలం నాటి వృత్తులు
వ్యవసాయానికి అనుబంధమైనవి కొన్ని, నిత్యావసర వస్తు సేవలను అందించేవి కొన్ని కాకతీయుల కాలంలోనూ ఉండేవి. అన్ని వృత్తుల్లో కుటీర పరిక్షిశమ స్థాయిలో ఉన్నవి నేత వృత్తి, గానుగ వృత్తి, లోహ వృత్తి. తిండి తరువాత అత్యవసర వస్తువులు బట్టలు. కాబట్టి, బట్టలు నేసే సాలెలకు కాకతీయ రాజ్యమంతటా ప్రముఖ స్థానం ఉండేది. ఒక్క ఓరుగల్లు పట్టణంలోనే పద్మశాలీలు 6,500ల మంది, పట్టు నేసే సాలెలు 2,500 మంది ఉండేవారట. పట్టు బట్టలకు విలువ ఎక్కువ. కాబట్టి, పట్టు సాలెలకు కూడా సమాజంలో విలువ ఎక్కువగా ఉండేది. వారు నేసే పట్టు బట్టలు ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి అయ్యేవి. వారి నైపుణ్యాన్ని రుద్రమదేవి కాలంలో నకీ.శ.1262-1289) తెలుగుదేశాన్ని సందర్శించిన వెనిస్ యాత్రికుడు మార్కోపోలో ఇలా పొగిడాడు. ‘‘వారు (పద్మశాలీలు) సాలెపురుగు జాల వలె వుండే అతి విలువైన సన్నని వస్త్రాలను నేసేవారు. వాటిని ధరించనొల్లని రాజు, రాణి ప్రపంచంలో లేరు’’.
ఇదే మార్కోపోలో ఆనాడు తెలుగునాట వజ్రాల పరిక్షిశమ కూడా ఉండేదని, ప్రకాశం జిల్లా దేశీయక్కొండ (నేటి మోటుపల్లి) రేవు నుండి వజ్రాలను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేవారని రాశాడు. పాకాల చెరువు గట్టు మీదున్న ఇనుప నాగలిని బట్టి, తెలంగాణలో ఇనుప పరిక్షిశమకు సంబంధించి కనిపిస్తున్న ఆనవాళ్ళను బట్టి, సాహిత్యంలో ఇనుప వస్తువులకు సంబంధించి కనిపిస్తున్న ప్రస్తావనలను బట్టి కాకతీయుల కాలంలో ఇనుప పరిక్షిశమ కూడా బాగా వర్ధిల్లిందని చెప్పవచ్చు.
అప్పటి వ్యాపార, వాణిజ్యాలు
ఆ కాలంలో తెలుగునాట జరిగిన వ్యాపారం మూడు రకాలుగా జరిగేదని చెప్పుకోవచ్చు. అవి: స్థానిక వ్యాపారం, స్వదేశీ వ్యాపారం, విదేశీ వ్యాపారం.అన్ని రకాల వ్యాపారాల్లో ఆ కాలంలో ప్రముఖ పాత్ర పోషించింది ఇరు వర్గాల వారు. వారు కోమట్లు, పెరికలు.
సమకాలిక సుమతి శతకంలో ‘పురికిని ప్రాణము కోమటి’ అని (కోమట్లు ప్రతి గ్రామానికి ప్రాణం వంటివారు) కోమట్ల ప్రాధాన్యాన్ని నొక్కి వక్కాణించారు. వివిధ కులవృత్తుల ప్రజలు ఉత్పత్తి చేసే వస్తువులు అందరి మధ్యన మారకం జరిగేట్లు చేసి అందరి అవసరాలను తీర్చడంలో కోమట్లు కీలక పాత్రను పోషించేవారు. వీరి కులసంఘాన్ని ‘నకరము’ అనేవారు. తెలివిగా ప్రవర్తించి లాభం గుంజేవారిని ఇప్పటికీ ‘నకరాలు’ చేస్తున్నారని అంటుంటాం. కోమటిని ‘సెట్టి’ లేదా ‘చెట్టి’ అనేవారు. రాజుకు పన్ను రూపంలో వచ్చిన ధాన్యం, వస్తువులను అమ్మడానికి కూడా రాచసెట్టిలు ఉండేవారు.
వ్యాపార వస్తువులను సంచుల్లో నింపి గాడిదల వీపుపైన అటొక సంచి, ఇటొక సంచి వేసి అలా వందల గాడిదలను అదిలించుకుంటూ వందల మైళ్ళ దూరాలలో ఉన్న వ్యాపార కేంద్రాలకు చేరవేసే వారిని పెరికపూత్తువారు అనేవారు. ‘పెరిక’ అంటే గాడిద వీపుపై రెండు వైపులా వేలాడదీసిన రెండు వస్తువుల సంచుల ప్రమాణం. రాను రాను పెరికపూత్తు కాపువారిని పెరికలు అనడం స్థిరపడిపోయింది. పెరికపూత్తు వారు గుర్రాలు, ఎడ్ల బండ్లపైన కూడా సరుకులను వ్యాపార కేంద్రాలకు చేరవేసేవారు.
వారం వారం వ్యాపారం జరిగే చోటును ‘అంగడి’ అనేవారు. ‘పెంట’ అని కూడా అనేవారు. పెంట రానురాను ‘పేట’ అయ్యింది. పెంటల నిర్మాణం, నిర్వహణ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరిగేది. వ్యాపారులు తమ సరుకులను నిల్వ చేసుకునేందుకు ‘పాక’లను కూడా ప్రభుత్వమే కట్టించేది. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వానికి అంగడి/వ్యాపారం మీద సుమారు పది రకాల సుంకాలు వచ్చేవి.
వ్యాపార వాణిజ్యాలపై పన్నులు వసూలు చేసినా వాటి వెనుక ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఉండేది. పన్నుల ద్వారా వచ్చిన ఆదాయంతో ప్రభుత్వం వ్యాపార వాణిజ్యాల విషయమై ప్రజలకు కావలసిన వసతి సౌకర్యాలను నిర్మించేది. పైగా పన్నులు కూడా వ్యాపార సరుకు కొనుగోలు/అమ్మకాల విలువలో ఒకటింట ఎనభై వంతు నుంచి ఒకటింటికి నలభై వంతు వరకు ఉండేవి. అంత మాత్రమే. ఆనాటి ప్రభుత్వం వ్యాపార, వాణిజ్యాల నిర్వహణ విషయంలో ఎంత జాగరూకత వహించేదో తెలియజేయడానికి సంబంధించిన పద్యం ఒకటి ‘నీతిసారం’ అనే గ్రంథంలో ఉంది.
స్థానిక వ్యాపారం అంగళ్ళలో కొన్ని ఊర్ల పరిమితిలో జరిగేది. ఈ వ్యాపారం ఎక్కువగా ‘సమయాల’ పరిధిలో జరిగేది. ‘సమయం’ అంటే కులవృత్తి సంఘం. ప్రతి కులానికీ సమయం ఉండేది. ఆ కుల ప్రజలందరూ అందులో సభ్యులే. ప్రతి కులానికీ సమయం ఉండేది. ఆ సమయం ఉత్పత్తి చేసిన వస్తువులను దాని ప్రతినిధులు స్థానిక అంగడిలో అమ్మేవారు. అయితే స్థానిక వ్యాపారం చేసే శ్రేణులు (సంఘాలు) కూడా ఆనాడు మనుగడ సాగించాయి. కాకతీయ పూర్వయుగంలో శ్రేణుల్లో సేట్లు (కోమట్లు) మాత్రమే సభ్యులుగా ఉండేవారు. కానీ, కాకతీయ యుగంలో అలాంటి వర్తక శ్రేణుల్లో సెట్లతోపాటు రెడ్లు, నాయుళ్ళు, దాసర్లు, బోయలు తదితరులు కూడా సభ్యులుగా ఉండేవారు. స్థానిక వ్యాపారం ఎక్కువగా నిల్వ ఉంచలేని వస్తువులు ఉప్పు, పప్పు, బెల్లం, నేయి, కూరగాయలు, బట్టలు తదితరాల మీద జరిగేది. కాబట్టి, ఇలాంటి చిల్లర వ్యాపారం చేయడంలో ఆ రోజుల్లో ‘శాసిర్బరు సమయం’గా పేరు గాంచింది.
కాకతీయుల కాలం నాటి ప్రధాన వ్యాపార కేంద్రాలు ఇవి: మఠియవాడ (అనుమకొండ - ఓరుగల్లు మధ్యనుంది), పానుగల్లు, పేరూరు (నల్గొండ జిల్లా), జడ్చెర్ల, అలంపురం, మగతల (మహబూబ్‌నగర్ జిల్లా), మంథెన, దేశీయక్కొండ, త్రిపురాంతకం, పేద/చిన గంజాం పకాశం జిల్లాలు), గుడివాడ, మాచెర్ల, ఎనమదల (గుంటూరు జిల్లా), దోర్నాల, శ్రీశైలం, కృష్ణపట్నం (నెల్లూరు జిల్లా) మొదలైనవి.
కాకతీయ రాజధానిలోని ప్రధాన వ్యాపార కేంద్రాన్ని మఠియవాడ లేదా మట్టెవాడ అనేవారు. మఠియ అంటే వస్తువు. గణపతి దేవుడు ఓరుగల్లు కోటలో వేయించిన శాసనం ప్రకారం ఓరుగల్లు/మఠియవాడలో ఏయే అంగళ్ళలో, ఏయే సమయాలు, ఏయే సరులకును అమ్మేవారో కింద చూడవచ్చు:
-ఇలా వ్యవసాయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, మరే ఆర్థిక వృత్తి అయినా కావచ్చు. కాకతీయ రాజులు అన్ని ఆర్థిక రంగాల్లో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి ప్రజా సంక్షేమాన్ని అనూహ్యంగా పెంచారు. కాబట్టే, కాకతీయుల కాలం స్వర్ణయుగం కాగలిగింది. అలాంటి రాజులను కన్న తెలంగాణ మళ్ళీ అలాంటి రాజుల కోసం, రాజ్యం రాక కోసం ఎదురు చూస్తున్నట్లుంది.
గణపతిదేవుని ఘనత తెలిసిన వైనం
మరొకటి రాతి (శిలా) శాసనం. ఇది మా ఊరిలోని తమ్మచెరువు కట్టమీదున్న హనుమంతుని గుడిలోని స్తంభానికి చెక్కి ఉంది. దీనిని 1930లో మంథని మున్సిఫ్ మేజిస్ట్రేట్‌గా నియమితులైన శ్రీనివాసరావు, అప్పటి పండితులైన తిరువరంగం పాపయ్యాచార్యులు, కమ్మంభట్ల అప్పన్న శాస్త్రిలచే చదివించి రాయించారు. 1934లో శ్రీ కంభంభట్టుల అప్పన్న శాస్త్రి ‘గోల్కొండ’ పత్రికలో ప్రచురించారు.
అయితే, ‘గోల్కొండ’ పత్రిక తెలుగు పత్రిక కావడంతో భారతదేశంలోని ప్రముఖ చరివూతకారులకు, మేధావులకు ఆ శాసన విషయం పెద్దగా తెలియరాలేదు. 1958లో ఆ పనిచేసింది భారతదేశ ప్రముఖ శాసన పరిష్కర్త డాక్టర్ దినేశ్‌చంద్ర సర్కార్.
సర్కార్ మంథని సందర్శించ వచ్చినప్పుడు ఒకే బస్సులో నేను, ఆయన కలసి ప్రయాణించాం. మాటల సందర్భంలో మంథెనలో ‘గోపీజన వల్లభుని మందిరం ఉందా?’ అని అడిగారు. నేను వారిని శ్రీ వెంకటరాజన్న అవధాని ఇంటికి తీసుకెళ్ళాను. మేము తమ్మిచెరువు కట్ట హన్మంతుని గుడిలోని కాకతీయుల శాసనం (ఇప్పుడు దీపపు స్తంభంగా వాడుతున్న దానిని) పరిశీలించాం. సర్కార్ దానిని కాపీ చేసుకున్నారు.
ఈ రాతి శాసనంలో గణపతి దేవుడు కాకతీయ సింహాసనానికి శాలివాహన శకం 1121 సిద్ధార్థ నామ సంవత్సరంలో వచ్చాడని తెలుపబడింది. అదే సంవత్సరం మకర సంక్రాంతి... అనగా క్రీ.శ. 1199 డిసెంబర్ 26 నాడు వేయించబడిన ఈ శాసనంలో గణపతి దేవుని ఘనతను తెలిపే మూడు సంస్కృత పద్యాలు దేవనాగరి లిపిలో చెక్కబడినాయి. అవి
అస్తి ప్రశస్తిశాలి
ప్రవేశ గృహమఖిల దేశ రత్నానామ్
అలకానుకారి విభవం
అంధ్రమహీనగర మోరుగల్లురితి.
దీని తెలుగు సారాంశం, ఆంధ్రదేశంలో ఓరుగల్లు అనే ఒక పట్టణముంది. అది సమస్త దేశాలలో ఉన్న రత్నాలు వచ్చి ప్రవేశించడానికి అనువైన గృహం వంటిది. అది సంపదలో కుబేరుని అలకా నగరాన్ని అనుకరిస్తున్నది. ఎంతో ప్రశస్తి వహిస్తున్నది.
రెండవ పద్యం: తత్ర ప్రశాస్తి ధరణీం
భుంతే భోగాశ్చ గణపతి నృపతిః
అఖిల కిరణ తరంగ రంగిత పదాబ్జ.
దీని సారాంశం, అలాంటి ఆంధ్రదేశంలో గణపతి చక్రవర్తి రాజ్యాన్ని ఏలుతున్నాడు. భోగాలను అనుభవిస్తున్నాడు. సమస్త రాజులు అతనికి పాదాక్షికాంతులైనారు. వారి కిరీటాల అంచులలోని మణుల కాంతులు అతని పాద పద్మాలకు పూత పూస్తున్నట్లు ఉన్నాయి.
ఇక మూడవ పద్యం సారాంశం, కాకతీయ గణపతి దేవుడు రాజ్యాన్ని పొందాలి అని ప్రయాణంలో లేదా సంకల్పంలో చూపుతున్న వేగాన్ని తిరస్కరిస్తూ భూమి అతనికి స్వాధీనమైంది. సమువూదపు చెలియకట్ట ఆ భూమికి మొలనూలు ఆభరణంగా ఉంటున్నది. దాన్ని అతడు స్వంతం చేసుకొని అంతఃపుర స్త్రీగా అనుభవిస్తున్నాడు. తన గొప్ప కీర్తులను దానికి తెల్లని వస్త్రాలుగా గావించాడు.
పై పద్యాలలో ఓరుగల్లు రాజ్యం సంపదలతో తులతూగేదని, చక్రవర్తి గణపతి దేవునికి సామంతులందరూ అణిగి మణిగి ఉండటం వల్ల తెలుగుదేశంలో శాంతి సౌభాగ్యాలు విలసిల్లేవని, అట్టి భాగ్యాలకు నోచుకున్న తెలుగు దేశం బంగాళాఖాతం వరకు విస్తరించి ఉండేదని దీన్నిబట్టి స్పష్టమవుతోంది.
ఇదే శాసనంలో గణపతిదేవుని అనుమతితో అతని సామంతుడు చేర్నూరు (చెన్నూరు, ఆదిలాబాదు జిల్లా) దేశ పాలకుడు అల్లుం ప్రోలరాజు ధారాదత్తం చేసిన భూమి పాంతం)లో గణపతిదేవుని పురోహితుడు మంచిభట్టు మంథని ప్రాంతంలో అమలు జరిపిన అభివృద్ధి కార్యక్షికమాలు వివరించబడ్డాయి. ఈ మంచిభట్టే మల్లినాథసూరి. ఈయన సంస్కృత గ్రంథాల వ్యాఖ్యాన వేత్తల్లో భారతదేశంలోనే అత్యంత పేరెన్నిక గన్నవాడు.
ఇక, రాగి శాసనం గణపతిదేవ చక్రవర్తి న్యాయానికి ఎంత విలువ ఇచ్చేవాడో తెలియజేస్తుంది. ఇది పైన పేర్కొన్న రాతి శాసనం వేయించిన తరువాత సరిగ్గా నలుబై ఏడవ సంవత్సరంలో అనగా క్రీ.శ.1246 డిసెంబర్ 15 శనివారం (విక్షికమ శకం 1303 పరాభవ నామ సంవత్సరం పౌష్యమాసం శుద్ధ షష్టి)నాడు రాయించబడింది. ఇది ఒక కాలువ వివాదంలో గణపతి దేవుడిచ్చిన తీర్పును గురించి వివరిస్తుంది. అది:
నేఢవూరు అనే గ్రామంలో (కరీంనగర్ జిల్లా ధర్మారం మండలం) ఉండే గొనుగు కాలువ మీది హక్కు గురించి వివాదం తలెత్తింది. రవిదత్తుడు, నాథదేవుడు, హింగదేవుని అనేవారు అక్కడి స్థానిక అధికారులు. ఈ వివాదాన్ని గణపతి దేవుని దృష్టికి తీసుకు ఆయన తన గజ సైన్యాధిపతి జాయపదేవుని మంత్రి అయిన మంచిరాజును వివాదాన్ని పరిష్కరించమని నియమించి పంపాడు. మంచిరాజు నేఢవూరును దర్శించి, వివాదానికి సంబంధించిన గ్రామాలైన చామనపల్లి, కుమ్మరికుంట, దేవనపల్లి, కట్యకోలపల్లి గ్రామాల మహాజనులను బాహ్మణులు), పెద్దలను సమావేశ పరిచి వారి అభివూపాయాలను సేకరించాడు. ఈ అభివూపాయాలను ఓరుగల్లుకు వెళ్ళి గణపతిదేవునికి వినిపించాడు.
మంచిరాజు నివేదిక ఆధారంగా గణపతి దేవ చక్రవర్తి తన తుది తీర్పును నేఢవూరు ప్రాంత రాజ ప్రతినిధి అయిన మహారాజు అక్షయ చంద్రదేవుని సమక్షంలో ప్రకటించి, స్థానికాధికారులకు, గ్రామ ప్రజలకు ఆ తీర్పును తెలియజేయడానికి ప్రాడ్వివాకుడు (నాయమూర్తి) అయిన శ్రీపా మేనల్లుళ్ళయిన నారాయణ, మహారూక అనే అధికారులను చామనపల్లికి పంపించాడు. ఈ అధికారులు మళ్ళీ విచారణ జరిపి, మంచిరాజు నివేదిక సరైందని నిర్ధారించుకొని రాజు తీర్పును రాగి శాసన రూపంలో ప్రకటించారు. కాలువ మీద అధికారం చామనపల్లి మహాజనులదేనని, ఇతర గ్రామాల ప్రజలకు దానిమీద ఎటువంటి హక్కులేదని ఆ తీర్పు ప్రకటించింది.
పై శాసన వివరణను బట్టి గణపతిదేవుని కాలంలో న్యాయం విషయంలో సామాన్యులు కూడా తమ అభివూపాయాలను వెల్లడించడానికి అవకాశముండేదని, రాజు కూడా ప్రజాభివూపాయాన్ని ఎంతో గౌరవించేవాడని, ప్రజలు-వూపభువు సాధారణంగా న్యాయబద్ధంగా వ్యవహరించే వారని స్పష్టంగా తెలుస్తున్నది. ఇలా న్యాయం సరిగా అమలైనప్పుడు పైన పేర్కొన్న రాతి శాసనంలో వివరించినట్లు రాజ్యంలో శాంతి సౌభాగ్యాలు విలసిల్లడం సాధ్యమే. అలాంటి గణపతిదేవుని పాలన తెలంగాణలో పునరుద్ధరించ బడితే ప్రజలకు మరోసారి స్వర్ణయుగాన్ని అందుబాటులోకి తేవచ్చు. అది అతి త్వరలో సాకారం కావాలని, చంద్రునికో నూలుపోగు లాగా ఈ విషయాన్ని జనసామాన్యానికి చేరవేయడానికి నా వంతు కృషి ఉపకరించినందుకు సంతోషిస్తున్నాను.
Thursday, 21 June 2012
Tuesday, 29 November 2011
Travelogue on Kadile (near Nirmal) published in Andhrajyothy on 27-11-2011
ట్రావెలోకం
మనసు 'కదిలె'
రెండు ఎత్తయిన పర్వత సానువుల మ«ధ్య జన్మించి.. జలజలా ప్రవహిస్తోంది ఒక సెలయేరు. ఇది పాపహరేశ్వరాలయం మీదుగా ఉత్తరం వైపు లోయమార్గంలోకి పరుగులిడుతోంది. ఈ సెలయేరుకు ఇరు వైపులా 50 మీటర్లకు పైగా ఎత్తున్న చెట్లున్నాయి. నీటి మధ్యలో కూడా పొడవాటి వృక్షాలు కనువిందు చేస్తున్నాయి. ఆలయానికి ఈశాన్యంలో సెలయేరుకు అడ్డంగా కట్టిన డ్యామ్ పైనుంచి దుముకుతున్న నీరు జలపాతాన్ని తలపిస్తోంది. సెలయేరులో నడుచుకుంటూ ఒక ఫర్లాంగు దూరం వెళ్లగానే కుడివైపున ఒక ఆశ్రమం కనిపించింది. దాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దారు ఆ ఆశ్రమ స్వామీజీ.
ఆశ్రమం ముందు పెద్ద వట వృక్షాలు, వాటి చుట్టూ విశాలమైన ఆవరణ ఉంది. ఆశ్రమం దాటి ఆ సెలయేరు ఇంకా ఎంత దూరం ప్రవహిస్తుందో తెలియదు.
మేము మాత్రం ఇంకొంచెం దూరం నడిచి చిన్నపిల్లలకు కాళ్లు నొస్తాయేమోనని వెనుదిరిగాం. ఆకాశాన్ని తాకే చెట్ల మధ్య, పక్షుల కేరింతల మధ్య, నీటి గలగలల మధ్య నడవడం ఒక మధురానుభూతి. ఆ దృశ్యాలన్నిటినీ కెమెరాల్లో బంధించాం.
కదిలే శివలింగం..
నాకు మాత్రం అక్కడి సెలయేరు సవ్వడి, పక్షుల కువకువలు, చెట్లపై వీస్తున్న గాలి చప్పుడే లౌడ్‌స్పీకర్‌లో పెట్టి వినిపించినంత స్పష్టంగా వినిపించాయి. ఈ ఆలయంలోని శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. అది కదులుతుంది. భార్గవ రాముడు తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని చంపిన తర్వాత పాపపరిహార నిమిత్తం దేశంలో 31 శివలింగాలను ప్రతిష్టించాక.. ఇక్కడికొచ్చి 32వ లింగాన్ని పెట్టాడట. అయితే ఈ శివలింగం కదలడంతో తనకు శివుడు ప్రసన్నుడైనాడని ఆయన భావించినట్లు చెబుతుంది స్థల పురాణం. వాస్తవంగా గుట్టల్లో నుండి ఉబికి వస్తున్న నీటిబుగ్గ చుట్టూ పానవట్టాన్ని బిగించి, సరిగ్గా ఆ బుగ్గపైనే శివలింగాన్ని ఏర్పాటు చేయడంతో.. అది నీటి తాకిడికి కదులుతోంది. ప్రకృతి సౌందర్యానికి పవిత్రతను చేకూర్చేందుకే ఇలా చేశారనిపించింది.
ఆలయానికి దక్షిణంగా ఉన్న రెండు విశాలమైన గదుల్లో నిత్యాన్నదానం జరుగుతుంది. భోజనం తీసుకువచ్చామన్నా మమ్మల్ని కూడా తినమన్నారు ఆలయ నిర్వాహకులు. అక్కడ భక్తులు తమ ఇష్టసిద్ధి కోసం యాగాలు చేస్తున్నారు. ఆలయానికి ఈశాన్యంలో విశాలమైన, చదునైన ఖాళీ స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆవరణలోనే ఏటా శ్రావణమాసంలో 30 రోజులపాటు జాతర, శివరాత్రి సందర్భంగా మరో 3 రోజుల జాతర నిర్వహిస్తున్నారు.
18 చెట్ల వటవృక్షం..
ఆలయానికి కొంతదూరంలో 18 రకాల చెట్లు ఒకే మహా వటవృక్షంలో పుట్టి పెనవేసుకొని పెరిగాయి. ఈ వటవృక్షంలో మద్ది, మేడి, జీడి, వేప, రావి, టేవు తదితర చెట్లుండటం విశేషం. దాని చుట్టూ ప్రదక్షిణ పథం ఉంది. అందులో ప్రదక్షిణలు చేస్తూ.. వటవృక్షానికి నిర్ణీత సంఖ్యలో నూలుదారం చుట్టి.. దీని మొదలు దగ్గర పూజలు చేసినవారికి సంతానయోగ్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ వటవృక్షం దగ్గరికి ప్రతినెలా పౌర్ణమి, అమావాస్యల రాత్రి వెయ్యేళ్ల సర్పం వస్తుందని, దాన్ని చూసినవారు ఇక్కడ చాలా మందే ఉన్నారని చెపుతారు.
పాప హరిణి..
లోయలో ఉన్న ఈ ఆలయానికి పశ్చిమాన ఎత్తయిన పర్వతాలున్నాయి. అటు వైపు నుంచి వచ్చే చెడు గాలులు, కాస్మిక్ శక్తులను ఆ కొండలు ఆపి భక్తులను రక్షిస్తాయి. ఈ ప్రక్రియను సామాన్య జనులకు అర్థమయ్యే భాషలో... పశ్చిమం వైపు 'శని' ఉంటాడని, ఇక్కడి దేవుడు అతని బారి నుండి భక్తులను కాపాడతాడని చెప్తారు. దేశంలో దేవాలయాలన్నీ తూర్పుకు అభిముఖంగా ఉండగా, ఇదీ, కాశ్మీర్‌లో ఉన్న మరొక ఆలయం మాత్రమే పశ్చిమాభిముఖంగా ఉన్నాయని చెపుతారు.
సప్తర్షి గుండాల వెనుక..
రెండవ గుండు పేరు సర్వ పాపనాశిని గుండం. ఆవు మూతిలో నుంచి వస్తున్న నీటితో ఒక మేడి చెట్టు కింద ఏర్పడింది ఈ గుండం. హిరణ్యకశ్యపుణ్ణి చంపిన అనంతరం నరసింహస్వామి చేతి గోళ్ల నుంచి రక్తం కారిపోతూనే ఉంటే లక్ష్మీదేవి మేడి ఆకుల రసం పోసి ఆ రక్తస్రావాన్ని ఆపిందని 'గురుచరిత్ర'లో ఉంటుంది. అలాంటి హీలింగ్ పవర్ ఉన్న చెట్ల నుంచి వస్తున్న నీటిలో స్నానం చేస్తే రోగాలు హీల్ (నయం) అవుతాయంటే నమ్మొచ్చేమో.
అత్తా కోడళ్ల గుండాలు..
మూడవ, నాల్గవ గుండాల పేర్లు శివార్చన గుండం, పాలగుండం. గర్భగుడిలో శివలింగానికి చేసిన అభిషేకపు నీటితో, పాలతో ఈ గుండాలేర్పడ్డాయని ఆ పేర్లు పెట్టారు. ఐదవ నీటి గుండానికి శివతీర్థ గుండమని పేరు. దీనికి ఉత్తరాన ఉన్న ఆరవ, ఏడవ గుండాలకు సూర్య చంద్ర గుండాలని పేరు పెట్టారు. సూర్య గుండంలోని నీరు వేడిగా, చంద్రగుండంలోని నీరు చల్లగా ఉంటుంది. అందుకే ఆ పేర్లు. ఈ రెండు గుండాలను స్థానికులు అత్తాకోడళ్ల గుండాలని కూడా అంటారు.
వాస్తు శిల్పాల చరిత్ర..
పైగా ఈ రెండు ఆలయాల శిఖరాలు, వాటికున్న ఎత్తయిన అరుగులు, స్తంభాలు చాళుక్యరీతిలో ఉన్నాయి కాబట్టి.. చాళుక్యులు పంచాయతన మతాలను పోషించారన్న వాదన సమర్థనీయంగానే కనిపిస్తోంది. చాళుక్యులు తెలంగాణను క్రీ.శ 560 నుంచి 753 వరకు ఒకసారి, క్రీ.శ.973 నుంచి 1160 వరకు మరోసారి పరిపాలించారు.
ఇక్కడి లింగం 32వదని, కర్నూలు జిల్లా యాగంటిలోని శివునితో సంబంధం కలదని స్థలపురాణం చెప్పడంలో ఓ ఆంతర్యం ఉంది. అదేమిటంటే- ఈ రెండు స్థలాల మధ్య చాళుక్యుల సామ్రాజ్యం విస్తరించడం.
ఇలా వెయ్యేళ్ల చరిత్ర కలిగిన 'కదిలె' ప్రాంతాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ తమ బాసర ఇక్కడికి 60 కిలోమీటర్లు. కుంటాల జలపాతం ఇక్కడికి 50 కిలోమీటర్లు. టూర్లలో భాగంగా చేర్చి ప్రచారం చేస్తే బాగుంటుంది.
- డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ, ఫోన్ 9440687250
Thursday, 3 November 2011
Thursday, 20 October 2011
Invitation to Scholars
Dear Sir/Madam,
I am herewith sending the invitation letter with certain guidelines and a tentative list of chapters of History and Culture of Telangana. Please go through them and keep us informed on which chapter you are pleased to contribute.
Thanking you.......
Dr. D.Satyanarayana
I am herewith sending the invitation letter with certain guidelines and a tentative list of chapters of History and Culture of Telangana. Please go through them and keep us informed on which chapter you are pleased to contribute.
Thanking you.......
Dr. D.Satyanarayana
Chapters of
HISTORY AND CULTURE OF TELANGANA
From Earliest Times to 1956 AD
INTRODUCTION: ENVIRONMENT AND SOURCES dr d satyanarayana
I. ANCIENT TELANGANA
1. STONE AGE s b kesava and padmanabha
2. METAL AGE prof k p rao
3. SATAVAHANAS dr pvp sastry
4. IKSHVAKUS AND ABHIRAS dr d satyanarayana
5. VISHNUKUNDIS, VAKATAKAS AND RANADURJYAS dr d satyanarayana
6. EARLY CHALUKYAS d suryakumar
7. RASHTRAKUTAS AND VEMULAVADA CHALUKYAS d surya kumar
8. LATER CHALUKYAS, THEIR FEUDATORIES AND CONTEMPORARIES
d suryakumar, sandeveni tirupati
d suryakumar, sandeveni tirupati
II. MEDIEVAL TELANGANA
9. KAKATIYAS dr pvp sastry
10. POST KAKATIYA KINGDOMS – I prof r soma reddy
MUSLIM PRESNCE IN WARANGAL
MUSUNURI NAYAKAS
RACHAKONDA-DEVARAKONDA NAYAKAS
11. POST KAKATIYA KINGDOMS – II k jitendrababu
GONDS OF ADILABAD
SHITABKHAN OF WARANGAL
ORISSA GAJAPATIS
PRESENCE OF VIJAYANAGARA KINGS
12. BAHAMANIS AND IMADSHAHIS dr salma and dawood ashraf
13. QUTBSHAHIS (INCLUDING MUGHALS, 1687-1724 AD) dr salma,
dr j anjaiah and dr s jaikishan
III. MODERN TELANGANA
15. NIZAMS, 1724-1948 AD
A. Polity dr n r giridhar and dr d satyanarayana
i) Foundation of Asafjahi Rule
ii) Carnatic Wars – French Involvement
iii) British Influence
iv) Administrative Reforms
B. Economy prof v ramakrisna reddy
v) Agriculture and Environment: Construction of Tanks and Projects
Introduction of Commercial Crops (Sugarcane, Silk, Fish, etc.)
Forest Policy and Produces
vi) Mines and Industrial Development: Singareni Collieries
vii) Science & Technology, Medicine, etc.
viii) Communications: Introduction of Railways, Roadways and Airways, Posts, etc.
C. Society prof a satyanarayana
ix) Nobility and Zamindars
x) Immigrants and Emigrations
xi) Women: Concubinage and Prostitution
xii) Food and Dress
D. Religion prof a satyanarayana
xiii) Conversions by Razakars and Christian Missionaries
xiv) Development of Composite Culture: Spread of Muslim festivals among Hindus
xv) Charities: Baolis, orchards, etc.
E. Culture
xvi) Literature: Urdu and Persian – Ghazals, Telugu dr sunkireddi
xvii) Music and Dance: Gana Bhajanas and Theatre and Performing Arts
prof umadevi
xviii) Painting and Sculpture dr b s rohini
xix) Architecture dr vasanta shobha
xx) Popular Culture prof j tirumala rao
xxi) Pastimes: Hunting, Cinema, etc. vaaraala anand
16. SAMSTHANAS UNDER NIZAMS dr m ramulu
17. SOCIO-CULTURAL AWAKENING dr s anjaiah
i) Education: Urdu University, English Schools, Girls Education
ii) Literary Movement: Library Movement, Nationalist Literature and Andhra Sarasvata Parishath, Press and Journalism
iii) Mulki Movement
iv) Caste and Dalit Movements prof a satyanarayana
v) Working Class Protests
vi) Tribal Resurgences dr g sudarshan reddy
vii) Women Associations
18. FREEDOM STRUGGLE dr ramesh and prof tirumali
i) 1857 Revolt
ii) Political Awakening
iii) Aryasamaj Movement
iv) Andhra Mahasabha k jitendrababu
v) Razakars
vi) Anti-Nizam Movements
vii) Communist and Armed Struggle
viii) Police Action dr l pandu ranga reddy
19. MERGER OF TELANGANA AND THE FORMATION OF ANDHRA PRADESH n venugopal
Subscribe to:
Posts (Atom)

